Breaking News

ప్రియురాలి ఇంట్లోనే యువకుడి దారుణహత్య.. గదిలో ఏకాంతంగా ఉండగా


ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికే వెళ్లిన యువకుడు దారుణహత్యకు గురైన ఘటన తమిళనాడులో జరిగింది. యువతి కుటుంబసభ్యులే అతడికి కిరాతకంగా నరికి చంపేశారు. కడలూరు జిల్లా ప్రాంతానికి చెందిన ఆర్ముగం కుమారుడు అన్బళగన్‌(21), అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రేమజంట కలుసుకోవడం కుదరడం లేదు. దీంతో గత నెల అన్బళగన్ ధైర్యం చేసి ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. అతడిని చూసి బాలిక కుటుంబసభ్యులు మరోసారి ఇలా చేస్తే చంపేస్తామని బెదిరించి విడిచిపెట్టారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని అతడు గతవారం మరోసారి ప్రియురాలి ఇంటి ముందు తిరుగుతుండగా వారు చితక్కొట్టి పంపించారు. Also Read: శుక్రవారం ఇంట్లో ప్రియురాలు ఒంటరిగా ఉందన్న సమాచారం తెలుసుకున్న అన్బళగన్ ఉత్సాహంగా ఆమె ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ గదిలో ఏకాంతంగా ఉండగా కుటుంబసభ్యులు వచ్చాడు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన బాలిక తల్లిదండ్రులు, సోదరుడు అన్బళగన్‌ను కత్తులతో నరికి చంపేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న వారంతా ఓ లేఖను అక్కడ ఉంచి పరారయ్యారు. ఆ ఇంట్లో విగతజీవిగా పడివున్న అన్బళగన్‌ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ కార్తికేయన్‌, ఇన్‌స్పెక్టర్‌ మురుగేశన్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అతడి శరీరంపై అనేకచోట్ల కత్తిగాయాలను గుర్తించారు. Also Read: మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిదంబరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్బళగన్ తమ కుమార్తెను ప్రేమవలలో వేసుకుని కుటుంబ పరువు బజారుకీడ్చేలా ప్రవర్తించినందునే అతడిని చంపినట్లు నిందితులు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి ఎస్ఐ సురేశ్‌ మురుగన్‌ నేతృత్వంలో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ కార్తికేయన్‌ చెప్పారు. Also Read:


By June 07, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-murdered-at-girlfriend-house-in-tamil-nadu/articleshow/76241785.cms

No comments