ప్రాణం తీసిన క్రికెట్ వివాదం.. పక్కింటి వారి దాడిలో యువతి మృతి
క్రికెట్ కారణంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ యువతి హత్యకు గురైన ఘటన తమిళనాడులో విషాదం నింపింది. జిల్లా కార్కవాయల్ గ్రామానికి చెందిన శక్తివేల్ (55), సుందరి దంపతులకు షణ్ముగప్రియ (24), కౌసల్య (23), సత్య (22), ఫౌసియా (21) అనే నలుగురు కుమార్తెలు, కుమారుడు వసంతసేనన్(19) ఉన్నారు. వీరి పక్కింట్లో ఉండే కుబేంద్రన్(60), సరోజ దంపతులకు గురుప్రభు (28) అనే కుమారుడున్నాడు. శనివారం వసంతసేనన్, గురుప్రభులు క్రికెట్ ఆడుతూ గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే గురుప్రభు.. వసంత్‌సేనన్‌పై దాడి చేశాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న వసంత సేనన్ నలుగురు అక్కలు గురుప్రభు ఇంటికి వెళ్లి నిలదీశారు. రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో గురుప్రభు కుటుంబసభ్యులు కర్రలు, కత్తులతో నలుగురు అక్కాచెల్లెళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో షణ్ముగప్రియ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని పట్టుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితు కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు గురుప్రభుతో పాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 29, 2020 at 10:27AM
No comments