Breaking News

13ఏళ్ల బాలికపై కామం.. ఆర్నెల్లుగా లైంగిక వాంఛలు తీర్చుకుంటూ


తెలంగాణలోని జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 13ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాధితురాలి కుటుంబం నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ వార్త బయటకు పొక్కింది. మహబూబ్‌నగర్ మండలంలోని బావాయిపల్లి గ్రామానికి చెందిన వినోద్‌ పిండి గిర్నీ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలిక(13) తరుచూ పిండి పట్టించుకునేందుకు అక్కడికి వెళ్లేది. Also Read: బాలికపై కన్నేసిన వినోన్ ఆమెను మాయమాటలతో లొంగదీసుకుని అనేకసార్లు అత్యాచారం చేశాడు. సుమారు ఆరు నెలలుగా బాలికపై కీచకపర్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నెల 25న బాలికను తన బైక్‌పై ఎక్కించుకున్న వినోద్ పెద్దకొత్తపల్లి వైపు తీసుకెళ్తుండగా కొందరు గ్రామస్తులు గమనించారు. ఈ విషయాన్ని వెంటనే బాలిక తల్లిదండ్రులకు చేరవేశారు. బాలిక ఇంటికి వచ్చిన వెంటనే ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు తమ కూతురికి న్యాయం చేయాలని కోరగా వినోద్ పట్టించుకోలేదు. Also Read: దీంతో వారు ఆదివారం అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు ఆధారంగా వినోద్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముక్కపచ్చలారని బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వినోద్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By June 29, 2020 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-booked-for-raping-minor-girl-for-6-months-in-mabubnagar-district/articleshow/76683455.cms

No comments