మద్యం మత్తులో భార్య హత్య.. చూసిందని కూతురి గొంతు నులిమేశాడు
తాగుడుకు బానిసైన వ్యక్తి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనను చూసిందని కన్న కూతురిని కూడా గొంతు నులిమి ప్రాణం తీశాడు. ఈ ఘటన నగరంలో ఉర్సు గుట్ట ప్రాంతంలో ఆదివారం జరిగింది. వరంగల్ బీఆర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లుకు పదేళ్ల క్రితం రమ్య(29) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. వ్యాపారాల పేరుతో అందరి దగ్గర అప్పులు చేసిన వెంకటేశ్వర్లుకు ఆర్థికంగా చితికిపోయాడు. తర్వాత ఓ ప్రైవేటు సంస్థలో పనికి చేరాడు. Also Read: ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన అతడు రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేశాడు. దీంతో రమ్య కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై తాను బుద్ధిగా ఉంటానని భార్యకు నచ్చజెప్పిన వెంకటేశ్వర్లు ఆమెను తిరిగి తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో మరోసారి భార్యతో గొడవపడిన అతడు.. క్షణికావేశంలో రమ్య గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణాన్ని చూసిన కూతురు మనస్విని(8)ని కూడా గొంతు నులిమి ప్రాణం తీశాడు. Also Read: ఉదయం కనిపించిన రమ్య, మనస్విని మధ్యాహ్నమైనా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
By June 29, 2020 at 10:12AM
No comments