Breaking News

జులైలో పెళ్లికి ఏర్పాట్లు.. శ్మశానంలో ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్


ప్రేమించిన అమ్మాయిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన యువకుడు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో విషాదం నింపింది. వచ్చే నెలలోనే పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా విషపు గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలం పి.చింతకుంట గ్రామానికి చెందిన శేఖర్(25) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి నిశ్చయమైందన్న ఉత్సాహంలో శేఖర్ ఆమెను వెంటబెట్టుకుని తరుచూ బయట షికార్లు చేస్తున్నాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పెళ్లికాక ముందే అలా తిరగడం మంచిది కాదని, కొద్దిరోజులు ఓపిక పట్టాలని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన శేఖర్ శనివారం రాత్రి శ్మశానంలోకి వెళ్లి మద్యంలో విషపు గుళికలు కలుపుకుని తాగేశాడు. తర్వాత ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. Also Read: అతడు వెంటనే శేఖర్ కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని శ్మశానానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి వాహనంలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. శేఖర్‌ తల్లి వెంకటమ్మ ఫిర్యాదు ఆధారంగా ఆళ్లగడ్డ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శేఖర్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంటి రోదనలు వినిపిస్తున్నాయి. Also Read:


By June 29, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/auto-driver-commits-suicide-at-graveyard-in-kurnool-district/articleshow/76682497.cms

No comments