Breaking News

తాగడానికి నీళ్లు ఇవ్వలేదని మహిళపై దాడి.. మందుబాబు ఘాతుకం


గ్రహణం సమయంలో తాగడానికి నీళ్లు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు ఒంటరి మహిళపై దాడికి పాల్పడ్డాడో యువకుడు. జిల్లా పట్టణంలోని బొబ్బిలి రోడ్డులో నివాసముంటున్న మహిళ భర్త 13ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కుమార్తెతో కలిసి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆదివారం ఉదయం రాజాం పట్టణంలోని మల్లయ్యపేటకు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. సూర్యగ్రహణ సమయం కావడంతో నీళ్లు ఇవ్వనని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహించిన యువకుడు చేతిలోని మద్యం సీసాతో ఆమె తలపై కొట్టాడు. Also Read: బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పెద్దయెత్తున గుమిగూడారు. దీంతో నిందితుడు కంగారుపడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కుమార్తె ఇంట్లో లేదు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధితురాలిని రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొహంపై సీసాతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By June 22, 2020 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drunked-man-attacks-married-woman-in-srikakulam-district/articleshow/76503738.cms

No comments