అహ్మదాబాద్.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య

తమ నలుగురు పిల్లలతో కలిసి ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని వత్వా ప్రాంతంలోని తమ అపార్ట్‌మెంట్‌లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. సోదరులు గౌరంగ్ పటేల్, అమ్రిష్ పటేల్ తొలుత నలుగురు పిల్లల్ని చంపి, తర్వాత సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, సామాజిక కారణాలతోనే సోదరులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోదరులిద్దరూ గౌరవ్, అమ్రిష్‌లు పిల్లలను తీసుకుని బయటకు వెళ్తామని తమ భార్యలకు గురువారం చెప్పి వెళ్లారు. బయటకు వెళ్లిన వీరు చాలా సమయం గడిచిపోయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి భార్యలు ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. అయితే, శుక్రవారం ఉదయం ప్రయోసలోని తమ పాత ఇంటి వద్ద విగతజీవులుగా పడి ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాలను కిందకు దించి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తొలుత పిల్లలు మయూర్, ధ్రువ్, కీర్తి, సాల్వీలను చంపి, తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పిల్లలు ఎలా చనిపోయారనేది పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే, పిల్లలకు నోరు మూసి ఊపిరాడకుండా చేసి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి.
By June 19, 2020 at 11:08AM
No comments