Breaking News

అత్త బీమా కోసం అల్లుడి ఘాతుకం.. కూతురిని చంపి.. కృష్ణా జిల్లాలో దారుణం


అత్త బీమా సొమ్ము కోసం అల్లుడు ఘాతుకానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపేశాడు. ఆపై తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మండలం మంగళాపురం గ్రామానికి చెందిన డేగల పిచ్చయ్య(30)కి పెడన మండలం పోసినవారిపాలేనికి చెందిన దేవీ రాజేశ్వరి(22)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు సంతానం. ఇటీవల రాజేశ్వరి తల్లి మృతి చెందడంతో నామినీగా ఉన్న కూతురికి రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ బీమా డబ్బు తనకివ్వాలంటూ భర్త కొద్దికాలంగా భార్యతో గొడవపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అదే విషయమై మరోమారు గొడవ జరగడంతో ఆవేశంతో భార్యని దారుణంగా హతమార్చాడు. క్షణికావేశంలో కిరాతకంగా చంపేశాడు. Also Read: అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన పిచ్చయ్య భోగిరెడ్డిపాలెం సమీపంలో గుళికలు తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లీతండ్రి మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By June 19, 2020 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-after-wifes-murder-in-krishna-district/articleshow/76459234.cms

No comments