గుంటూరులో ఘోరం.. మీ సేవా నిర్వాహకుడి దారుణ హత్య

జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలం అడిగొప్పులలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న గంటా వాసుకి తన సమీప బంధువులతో పొలం తగాదాలున్నాయి. ఆ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మీ సేవా కేంద్రానికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా దాడి చేసి కిరాతకంగా చంపేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల దాడిలో వాసు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మీ సేవా నిర్వాహకుడి హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. Also Read:
By June 20, 2020 at 11:57AM
No comments