Breaking News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన నటుడు మధు, మహిళా పైలట్ సంజన


ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవంతంగా కొనసాగింది. మొక్కలు నాటే కార్యక్రమం మూడవదశకి విశేషమైన స్పందన లభిస్తోంది. ఒకరి నుండి మరొకరికి ఛాలెంజ్ అందుకున్న సెలెబ్రిటీ లు విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. సింగర్ మధుప్రియ మరియు చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన తెలంగాణ మొదటి మహిళా పైలట్ సంజన మరియు స్వీకరించారు. ఈ రోజు వీరిద్దరు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మూడు మొక్కలను నాటారు. ఎంపీ సంతోష్ గారు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ప్రతీ ఒక్కరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రేపటి భవిష్యత్ తరానికి పచ్చని పుడమిని బహుమతిగా ఇవ్వాలన్నారు. అలాగే ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ వంటి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ గారిని మధు, సంజన అభినందించారు. ఈ కార్యక్రమంలో చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే చాలా మంది సినీ నటులు, దర్శకులు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రమోట్ చేశారు. ఇటీవల బాహుబలి ప్రభాస్ కూడా మొక్కలు నాటాడు. హీరో విశ్వక్ సేన్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ హీరో విశ్వక్ సేన్.


By June 20, 2020 at 11:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/woman-pilot-sanjana-actor-madhu-participate-in-green-india-challenge/articleshow/76477518.cms

No comments