Breaking News

కబడ్డీ కోచ్‌లుగా గోపిచంద్, తమన్నా.. సీటీమార్ అంటున్న తారలు


గోపింద్, తమన్నా కబడ్డీ కోచ్‌ అవతార మెత్తారు. ఆంధ్ర కబడ్డీ టీం కోచ్ గా ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మారితే... తెలంగాణ కబడ్డీ టీం కోచ్ గా తమన్నా ఫ్యాన్స్‌ను కనువిందు చేయనుంది. వీరిద్దరూ కలిసి మాస్ డైరెక్టర్ డైరెక్షన్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సీటి మార్ పేరుతో ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇవాళ జూన్ 20 సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా `సీటీమార్` చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మించ‌బ‌డుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ సంవ‌త్స‌రంలో మొద‌ల‌యిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌ మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుంచి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. సీటిమార్ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తున్నారు. ఇక ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.


By June 20, 2020 at 12:22PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-gopichand-and-heroin-tamannaah-acting-as-coach-in-seetimaarr-movie/articleshow/76478123.cms

No comments