Breaking News

తల్లిని తిట్టాడని ఫ్రెండ్‌ని చంపేశాడు.. తూ.గో.జిల్లాలో దారుణం


తన తల్లిని అసభ్య పదజాలంతో తిట్టాడన్న కక్షతో ఓ యువకుడు స్నేహితుడినే హత్య చేసిన ఘటన కొమరగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. యానాంకు చెందిన అంకాడి శివరామవర్మ అలియాస్‌ ఆటోశివ(24), రాకేష్ స్నేహితులు. శనివార రాకేష్ తల్లిని అసభ్యంగా తిడుతూ ఆటోశివ వాయిస్ ఎస్ఎంఎస్ అతడికి పంపించాడు. దీంతో కక్ష పెంచుకున్న రాకేష్ తన తల్లిని తిట్టినవాడు బ్రతికుండకూడదని అనుకున్నాడు. ఆదివారం ఆటోశివ ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ మాట్లాడాలని చెప్పి అతడిని కొమరగిరి ఏటిగట్టు వద్దకు తీసుకొచ్చాడు. Also Read; అక్కడ రాకేష్ తన ఫ్రెండ్స్ తేజ, మాగం సతీష్‌, ఆర్‌జే, మరో ముగ్గురితో కలసి శివపై దాడి చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న శివను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఇది గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శివను వెంటనే ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే శివ అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. శివ, రాకేష్‌ ఏడాదిగా స్నేహితులుగా ఉంటున్నారని.. ఇద్దరి మధ్య నగదు లావాదేవీలు కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఐ.పోలవరం ఎస్సై రాము తెలిపారు. అమలాపురం డీఎస్పీ మసూంబాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. Also Read;


By June 29, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-kills-close-friend-with-another-friends-in-east-godavari-district/articleshow/76681445.cms

No comments