చిత్తూరులో ఘోరం.. లారీ బోల్తా పడి నలుగురి దుర్మరణం

చిత్తూరులో జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ, సరిహద్దులో బోరు లారీ బోల్తాపడింది. బోరు వేసేందుకు వెళ్తున్న లారీ ఒక్కసారిగా పక్కకు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జిల్లా బోర్డర్‌లోని పెద్ద తిప్పసముద్రం మండలంలో కర్ణాటక సరిహద్దులో జరిగింది. కర్ణాటకలోని పాలచెరువు పొలంలో బోరు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బోరు వేసేందుకు వెళ్తున్న మధ్యప్రదేశ్‌కి చెందిన కూలీలు మృత్యువాతపడ్డారు. మృతులను జయదేవ్, నవదేశ్, రాజారాం, సుబ్బుగా గుర్తించారు. వారంతా పొట్టకూటి కోసం బోరు లారీ వద్ద కూలీలుగా వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో సింగరోలి జిల్లా చిత్రాంగి ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By June 24, 2020 at 12:51PM
No comments