Breaking News

రికార్డుస్థాయిలో కరోనా మరణాలు.. ఆ జాబితాలో 9వ స్థానంలో భారత్


భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి మరింత ఉద్ధృతమవుతోంది. దేశవ్యాప్తంగా శనివారం దాదాపు 12వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 3.20 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 9,204గా నమోదయ్యింది. గత రెండు రోజులుగా శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజూ భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత రెండు వారాల నుంచి రోజుకు సగటున పదివేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కానీ, గడిచిన మూడు రోజులుగా రికార్డు స్థాయిలో సగటున 11వేల మంది వైరస్ బారినపడుతున్నారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,929 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 3.21 లక్షలకు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379మంది కోలుకోగా మరో 1,50,283 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1.04 లక్షలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఢిల్లీలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రోజువారీ మరణాల్లో ఢిల్లీ మహారాష్ట్రను దాటిపోయింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 127 మరణాలు సంభవించగా, ఢిల్లీలో 129 నమోదయ్యాయి. కరోనా మరణాల విషయంలో మరో రాష్ట్రం మహారాష్ట్రను దాటడం ఇదే తొలిసారి. జూన్ 1 నుంచి మహారాష్ట్రలో మరణాలు 62శాతం పెరగ్గా, ఢిల్లీలో 156శాతం పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 17 రాష్ట్రాల్లో 386 మరణాలు సంభవించగా అందులో 66శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. ఇదిలాఉంటే, కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. 9,650 మరణాలతో బెల్జియం 8వ స్థానంలో ఉండగా, 8,867మరణాలతో జర్మనీ 10స్థానంలో కొనసాగుతోంది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.


By June 14, 2020 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-in-india-11929-positive-cases-311-deaths-in-24-hours/articleshow/76367145.cms

No comments