రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం.. మూవీ మొగల్‌కి నివాళులర్పించిన సినీ ప్రముఖులు
నేడు (జూన్ 6) మూవీ మొగల్ డా.డి . ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు పలువురు సినీ ప్రముఖులు. ఈ కార్యక్రమంలో రామానాయుడు తనయుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, జె. బాలరాజు పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ''రామానాయుడు గారి 85వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించాము. రామానాయుడు గారు లేకుంటే హైదరాబాదులో సినిమా పరిశ్రమ, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు. ఫిలింనగర్‌లో విగ్రహంతో పాటు రామానాయుడు గారి పేరుతో ఏది మొదలు పెట్టినా సక్సెస్ అయింది. ఫిలింనగర్‌కు చెన్నారెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళ లాంటి వారు'' అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ''రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్. నన్ను దాసరి గారు, రామానాయుడు గారు ఎంతో ప్రొత్సహించారు. నిర్మాతలు గానే కాకుండా సినీ పరిశ్రమ, దానికి అనుబంధ ఆఫీసులన్నీ డెవలెప్ కావటానికి రామానాయుడు గారే కారణం. నాయుడు గారిని తలుచుకునే మేము సినిమా స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతిని ప్రతీ ఏడాది గొప్పగా జరుపుకుంటాము. రామానాయుడు గారి వారసుడిగా అభిరామ్ ఆయన ప్లేస్‌ను ఫిల్ చేస్తాడు'' అన్నారు. అనంతరం రామానాయుడు మనవడు అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు ఫిజికల్‌గా మన మధ్య లేకున్నా, మెంటల్‌గా నాకు సపోర్ట్ గానే ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కె.ఎస్‌రామారావు మాట్లాడుతూ.. ''నిర్మాతగా నాకు రామానాయుడు గారే స్పూర్తి. వారి ఫాలోవర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్‌లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రొత్సాహం ఎంతో ఉంది'' అన్నారు.
By June 06, 2020 at 12:44PM
No comments