Breaking News

మద్యానికి బానిసైన ఇల్లరికం అల్లుడు.. అత్త తిట్టిందని అఘాయిత్యం


మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్న అల్లుడిని అత్త మందలించింది. ఏదైనా పని చేసుకుని పెళ్లాన్ని పోషించాలని హితవు పలికింది. అయితే మద్యం మత్తులో ఉన్న అతడికి ఆమె మాటలు తీవ్రంగా బాధపెట్టాయి. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా పి.గన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. Also Read: కొత్తపేట మండలం రాకుర్తివారిపాలేనికి చెందిన ఆకుమర్తి విజయకృష్ణ ప్రసాద్‌(21) బెల్లంపూడి గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యతో కలిసి అత్తారింట్లోనే ఉంటూ ఇల్లరికం అల్లుడిగా సెటిలయ్యాడు. విజయకృష్ణ లాక్‌డౌన్‌లో ఏదొక పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల వైన్‌షాపులు తెరవడంతో రోజూ మద్యం తాగి గ్రామంలో జులయిగా తిరుగుతున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని భార్య ఎంత చెప్పినా అతడిలో మార్పు రాలేదు. Also Read: దీంతో ఈ నెల 15వ తేదీన అత్త అతడిని తీవ్రంగా మందలించింది. మద్యం అలవాటు మానుకుని ఏదైనా పని చేసి భార్యను పోషించాలని హితవు పలికింది. ఈ క్రమంలో అత్తా అల్లుడి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగేశాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పి.గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By May 18, 2020 at 07:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-in-east-godavari-district-over-family-disputes/articleshow/75796344.cms

No comments