తోటికోడలి వేధింపులు.. ఇద్దరు పిల్లలను చంపి వివాహిత ఆత్మహత్య
నవమాసాలు మోసి, కనిపెంచిన బిడ్డలనే ఓ తల్లి చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో విషాదం నింపింది. మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన గన్నవరపు రంగారెడ్డి రెండో కుమార్తె రాధిక (27)కు వెల్దుర్తికి చెందిన లచ్చిరెడ్డి అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దీపక్‌రెడ్డి(6), రిషిత(2) సంతానం. లచ్చిరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సోదరుడి కుటుంబంతో కలిసి పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. Also Read: ఐదు నెలల క్రితం లచ్చిరెడ్డి సోదరుడి కూతురు పొరపాటున ఫినాయిల్ తాగి చనిపోయింది. దీనికి రాధికే కారణమంటూ తోటికోడలు అప్పటి నుంచి వేధిస్తోంది. ఆమె కనిపించినప్పుడల్లా నా కూతురిని ఎందుకు చంపావంటూ నిలదీసేది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పగా.. కూతురు పోయిన బాధలో అలా అంటోందని, నువ్వే సర్దుకుపోవాలని సూచించాడు. అయితే తోటికోడలి వేధింపులు తీవ్రం కావడంతో రాధి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. Also Read: లచ్చిరెడ్డి మూడు రోజుల కిందట రాధిక, ఇద్దరు పిల్లలను తుమ్మలచెరువులోని పుట్టింట్లో వదిలి వెళ్లాడు. రాధిక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరి పిల్లలను దిండుతో ఊపిరాడకుండా చంపి తానూ ఉరేసుకుంది. కాసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయనట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. Also Read:
By May 18, 2020 at 07:23AM
No comments