తాళి కట్టిన మూడోరోజే వరుడి అదృశ్యం.. ప్రేమ వ్యవహారంపై అనుమానాలు

పెళ్లయిన మూడో రోజునే వరుడు అదృశ్యమైన ఘటన జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో వెలుగుచూసింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి పాములపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఈనెల 24న వివాహం జరిగింది. వరకట్నంగా రూ.15 లక్షలు ఇచ్చారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఆల్వకొండకు వెళ్లే మార్గంలో ఉన్న ఓ ఆశ్రమంలో పెళ్లి నిరాడంబరంగా జరిపించారు. Also Read: అయితే పెళ్లి అనంతరం మూడోరోజు బుధవారం వధువు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమానికి వరుడు వెళ్లాల్సి ఉంది. అయితే అతడు ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వరుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనకు ప్రేమ వ్యవహారమా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 28, 2020 at 08:14AM
No comments