Breaking News

పోలీస్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. మద్యం తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు


సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ, నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసే అక్రమ బాట పట్టాడు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన జిల్లా ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి అందిన సమాచారం మేరకు బొడ్డవర కూడలిలో ఉన్న చెక్‌పోస్టు వద్ద అరకు వైపు నుంచి ఎస్‌.కోట వైపు వస్తున్న బైక్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ముందు కూర్చొన్న వ్యక్తికి, డ్రైవింగు చేస్తున్న వ్యక్తికి మధ్యన తెల్లని గోనె సంచి ఉండటంతో దాన్ని చెక్ చేయగా 90 క్వార్టర్‌ మద్యం సీసాలు లభించాయి. Also read: పట్టుబడిన వారిల ఒకరు ఐదో బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ యవర్న శ్రీనివాసరావు కాగా, రెండో వ్యక్తి అదే బెటాలియన్‌లో దోబీగా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మద్యం సీసాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఎస్.కోట పోలీసులు తెలిపారు. Also read:


By May 28, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-conistable-arrested-in-vizianagaram-district-over-smuggling-liquor/articleshow/76055454.cms

No comments