అమెరికాలో నల్లజాతీయుల కాల్పులు.. కోమాలోకి వెళ్లిపోయిన నెల్లూరు యువకుడు

అమెరికాలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. పొదలకూరు మండలం లింగంపల్లికి చెందిన డేగా ధీరజ్‌రెడ్డి(28) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మనుబోలు మండలం మడమనూరులో అమ్మమ్మ ఇంటిలో పెరిగి బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో అమెరికాలో వెళ్లాడు. అక్కడ ఛార్లెస్టోన్ ఈస్ట్రన్ ఇలినోయిస్ యూనివర్శిటీలో కోర్సులో చేరారు. Also Read: ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు ( కాలమాన ప్రకారం) నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ధీరజ్‌పై పలువురు నల్లజాతి యువకుడు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలు కావడంతో అతడిని లోయిస్‌లోని మెర్సి ఆసుపత్రిలో చేర్చారు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. నల్లజాతీయుల కాల్పుల్లో ధీరజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తమకు 10వ తేదీ రాత్రి సమాచారం అందినట్లు ధీరజ్‌రెడ్డి మామ బిరదవోలు అజయ్‌కుమార్‌రెడ్డి మీడియాకు తెలిపారు. Also Read:
By April 12, 2020 at 09:14AM
No comments