Breaking News

నిజామాబాద్: పోలీస్‌పై దాడి చేసి తుపాకీతో పరారైన ఖైదీ.. అనారోగ్యం పేరుతో!


పోలీసులపై దాడి చేసి తుపాకీతో పాటు పరారయ్యాడు ఓ రిమాండ్ ఖైదీ. అనారోగ్యానికి గురైన ఆ ఖైదీని ఆస్పత్రికి తరలిస్తుండగా ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసి తప్పించుకున్నాడు. నిజామాబాద్‌‌ పట్టణంలో శనివారం (ఏప్రిల్ 4) రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కోర్టు ఇతడికి జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. జైల్లో ఉన్న అతడు అనారోగ్యానికి గురైనట్లు చెప్పడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి తిరిగొస్తున్న క్రమంలో నిందితుడు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ (షార్ట్ వెపన్)తో ప్రసాద్ పారిపోయాడు. అతడి కోసా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.


By April 05, 2020 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/remand-prisoner-attacks-police-constable-and-escapes-with-gun-in-nizamabad/articleshow/74989521.cms

No comments