పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లిన యువకుడు.. కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు

లాక్‌డౌన్ వేళ కడుపు నిండా తినడానికే పండుటాకులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేక ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే కాలం వెళ్లదీస్తున్న వేళ కొందరు దుర్మార్గులు వారి డబ్బుపైనే కన్నేశారు. జిల్లా ఆదోనిలో వృద్ధురాలికి ఓ ఆగంతకుడు ఇలాగే శోకం మిగిల్చాడు. ప్రభుత్వం అందించిన వృద్ధాప్య పింఛను రూ.2,250, పోలీసుల కోసం వంట చేయగా వచ్చిన రూ.600 మొత్తం కలిపి చీరకొంగులో పెట్టుకొని వస్తుండగా ఆ నగదు కిందపడిపోయాయి. Also Read: దీన్ని ఆమె గుర్తించేలోపే ఓ యువకుడు ఆ నగదును ఎత్తుకొని పరారయ్యాడు. దీంతో బాధితురాలు లక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం స్థానిక రెడ్డీస్ హాస్టల్‌లో లక్ష్మమ్మ పోలీసుల కోసం భోజనం వండి ఇంటికి వెళ్తుండగా రైల్వేస్టేషన్ రహదారిలో చీరకొంగులో పెట్టుకున్న డబ్బు కిందపడిపోయింది. ఆ డబ్బు కోసం వెళ్తుండగా ఓ యువకుడు ఆ సొమ్మును ఓ యువకుడు తీసుకుని పరారయ్యాడు. లాక్‌డౌన్ సమయంలో ఆ వృద్ధురాలికి ఎంతో అండగా ఉంటుందనుకున్న నగదును కోల్పోవడంతో ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. ఈ విషయాన్ని టూటౌన్ పోలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. Also Read:
By April 05, 2020 at 09:08AM
No comments