Breaking News

మద్యం దొరక్క భార్యకు వేధింపులు... చివరికి ఆమె చేతిలోనే దారుణ హత్య


మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తను కసిదీరా కడతేర్చిందో ఇల్లాలు. నిద్రపోతున్న అతడిపై ఇస్త్రీ పెట్టెతో దాడిచేసి మెడకు వైర్ చుట్టి చంపేసింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రాజబొల్లారం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి(35) వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు రెండేళ్ల కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన అతను కారణంగా మద్యం దొరక్క పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని గొడవ పడుతున్నాడు. Also Read: ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం ఆ వ్యక్తి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న అతన్ని ఇస్త్రీ పెట్టెతో దాడి చేసి దాని వైరును మెడకు బిగించి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అనుమానంతో భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమెకు మరో వ్యక్తి సహకరించి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By April 10, 2020 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-killed-by-wife-in-hyderabad/articleshow/75076245.cms

No comments