కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: న్యూయార్క్‌లో వైరస్ తగ్గుతున్న కరోనా తీవ్రత

⍟ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి వల్ల ప్రాణాలు కోల్పోగా.. బాధితుల సంఖ్య 16 లక్షలు దాటింది. దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసులను బట్టి సామూహిక వ్యాప్తి దశలోకి మహమ్మారి ప్రవేశించినట్టే. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 781కిపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. బుధవారంతో పోల్చితే గురువారం 30 శాతం కేసులు పెరిగాయి. బుధవారం మొత్తం 598 కేసులు నమోదు కాగా.. గురువారం ఇది 781గా ఉంది. ⍟ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌తో పోలీసులకు పనిభారం పెరిగిపోయింది. తీరిక లేని పనిభారం, ఎక్కువ సమయం డ్యూటీలో ఉంటుండటంతో వారిపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో వారు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఒత్తిడి భరించలేక అనారోగ్యానికి గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ⍟ నోవల్ కరోనా వైరస్‌పై పోరాటానికి కేంద్రం రూ.15000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో రూ.7774 కోట్లను తక్షణమే కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ఉపయోగిస్తారు. మిగతా మొత్తాన్ని 1-4 ఏళ్లలో మీడియం టర్మ్ సపోర్ట్‌గా ఉపయోగిస్తారు. ⍟ కరోనా వైరస్‌పై పోరులో ఎంతో మంది డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విధినిర్వహణలో ఉన్న పోలీసులు.. ఇంటి గేటు బయటే భోజనం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కరోనా పేషెంట్లకు చికిత్స అందించే డాక్టర్లయితే.. ఇళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ⍟ దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 9) ఒక్క రోజే దేశంలో 781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇదే గరిష్టం. అదేవిధంగా 31 మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకున్నాయి. ⍟ ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని భావించినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో కేసులు పెరగడంతో పాటూ నర్సరావుపేటలో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 51 కేసులు ఉన్నాయి. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. . ⍟ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఖైరతాబాద్ జోన్లోని మల్లేపల్లి (నాంపల్లి)లో పర్యటించారు. స్థానిక శాసనసభ్యులు, డీజీపీ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, సీపీ అంజనీ కుమార్ సీఎస్ వెంట ఉన్నారు. ⍟కరోనా కట్టడి, ప్రజారోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైరస్‌లు వ్యాప్తి చెందుతుండటంతో గ్రామ, వార్డు క్లినిక్స్ కీలకంగా మారతాయన్నారు. వైద్యపరంగా మౌలిక సదుపాయాలను పెంచుకునే ప్రక్రియలో భాగంగా వీటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
By April 10, 2020 at 09:21AM
No comments