Breaking News

కరోనా కోసం మోదీ ఏడు సూత్రాలు ఇవే...


కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్‌ డౌన్‌ను లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా వైరస్ విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదన్నారు ప్రధాని. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉందన్నారు. నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయన్నారు. భారత్ లాక్ డౌన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేమన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్నది మనం చూస్తేనే ఉన్నామన్నారు. మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుందన్నారు. సామాజిక దూరం పాటించడం, లౌక్‌డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగిందన్నారు ప్రధాని. లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసిన మోదీ...దేశ ప్రజలకు ఏడు సూచనలు చేశారు. ప్రతీ ఒకరు దీన్ని తప్పకుండా పాటించాలని కోరారు. ప్రధాని చెప్పిన ఏడు సూత్రాలు: 1. వృద్ధులు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి 2. లాక్ డౌన్ , సామాజిక దూరం పాటించండి 3 .రోగ నిరోధక శక్తి పెంపుదించుకోవాలి 4. ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుండి 5.పేద ప్రజలకు ఆహారాన్ని అందించండి 6. మీ తోటి పనిచేసేవారికి సహకారం అందించాలి 7. కరోనా కోసం పోరాడుతున్నవారిని గౌరవించండి


By April 14, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-s-7-appeals-to-indians/articleshow/75134902.cms

No comments