మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. మోదీ కీలక ప్రకటన

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం భారత్ ఇప్పటివరకు అద్భుతంగా పోరు సాగించిందని చెప్పిన మోదీ.. మరి కొంత కాలం ఇలాగే పోరు సాగించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరమే మేలైన నిర్ణయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు. విస్తృత సంప్రదింపుల అనంతరమే ఈ ప్రకటన చేస్తున్నట్లు వివరించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు పొడిగించాలని కోరాయని.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు పొడిగించాయని మోదీ గుర్తు చేశారు. అయితే.. ఈసారి కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
By April 14, 2020 at 10:22AM
No comments