లాక్‌డౌన్ అతిక్రమించి కారులో షికార్లు.. నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్

దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు కొందరేమో నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులకు తలనొప్పులు తెస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ యువకుడు రోడ్లపై తిరిగేందుకు ఏకంగా నకిలీ ఐఏఎస్ అవతారమెత్తాడు అనుమానం వచ్చిన పోలీసులు అతడిని విచారించగా అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో యువకుడు(29) కారులో వెళ్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో కారు రావడంతో అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని ఆపారు. Also Read: కారులోని వ్యక్తిని విచారించగా తాను ఐఏఎస్ అధికారినని, హోంశాఖలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. కారుపై ఇండియన్ గవర్నమెంట్, పోలీస్ అనే స్టిక్కర్లు ఉన్నాయి. అతని డైరీలో ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన లిస్ట్ కూడా ఉంది. కానీ అతడిపై అనుమానం వచ్చిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఐఏఎస్ అధికారి అయితే ఐడీ కార్డు చూపించాలని పోలీసులు అడగ్గా... తన దగ్గర ఐడీ కార్డు లేదని, దానికి బదులుగా కేంద్ర హోంశాఖకు చెందిన ఫైల్ చూపించాడు. Also Read: దీంతో అతడిని కారులో నుంచి దించి లోతుగా ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అతడు ఫేక్ ఐఏఎస్ అని నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:
By April 14, 2020 at 11:20AM
No comments