కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: కోవిడ్ వ్యాప్తి తగ్గడం లేదు.. కేసీఆర్ ఆందోలన

⍟ బారినపడ్డ ఓ వ్యక్తి తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే ఉమ్మేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కొవిడ్-19 నిర్ధారణ అయిన ఓ నలభై ఏళ్ల వ్యక్తి శనివారం రాత్రి తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతడు డాక్టర్లకు సహకరించడం లేదని, తన మాస్క్‌ను తీసి వారిపైకి విసిరేశాడు. తర్వాత తనకు చికిత్స చేయడానికి ప్రయత్నించిన వైద్యుడిపై ఉమ్మేశాడు. దీంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వైద్యుడిపై ఉమ్మినందుకు రోగిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ⍟ చైనాలోని హుబే ప్రావిన్సుల్లో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. ⍟ దేశంలో కరోనా వైరస్ కట్టిడికి విధించిన 21 రోజుల లాక్‌డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పలు రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే, ఏప్రిల్ 15 తర్వాత దేశాన్ని మూడు జోన్‌లు విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ⍟ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీసీ ఛైర్మన్ రోజా కూడా శానిటేషన్‌లో భాగస్వామ్యం అయ్యారు. కరోనా పాజిటివ్ నమోదైన వడమాలలో స్వయంగా సోడియం ఆమె హైపో క్లోరైడ్ పిచికారీ చేశారు. స్ప్రేయర్‌తో ఇంటింటికీ తిరిగి స్ప్రే చేస్తూ జనానికి అవగాహన కల్పించారు. వడమాల మండలంలో పాజిటివ్ కేసు నమోదైందని.. అందుకే శానిటేషన్ చేపట్టామన్నారు రోజా. ⍟ కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా ఎన్నడూ లేనంతగా అతలాకుతలం అవుతోంది. మొన్నటివరకు కేసుల సంఖ్యలో మాత్రమే మొదటి స్థానంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు మరణాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. రోజురోజుకీ పరిస్థితి చేయి దాటుతుండటంతో అధినేత నుంచి కిందిస్థాయి అధికారులకు వరకు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విరాజిల్లుతున్న అమెరికాలో కరోనా మరణాల్లో ముందు వరుసలో నిలవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ⍟ చిత్తూరు జిల్లా శ్రీకాహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో భారీ ర్యాలీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా నివారణకు విరాళాలు ఇచ్చిన వారి ఫొటోలను ట్రాక్టర్లపై పెట్టి భారీ ర్యాలీతో ప్రచారం చేశారు. దాదాపు వెయ్యిమందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ⍟తెలంగాణలో ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఉన్నందునే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొని ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ⍟ తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మరింతగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 28 గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 531కి చేరింది. ఆదివారం 28 పాజిటివ్ కేసులను గుర్తించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం మరో ఇద్దరు మృతి చెందారు. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం మరో 15 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 420కు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు జరిగిన కోవిడ్ 19 పరీక్షల్లో గుంటూరు జిల్లాలో 7, నెల్లూరులో 4, కర్నూలులో రెండు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ⍟మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 221 మందికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. ఇదే సమయంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి మొత్తంత 22 మంది చనిపోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2 వేలకు చేరువకు వచ్చాయి. ప్రస్తుతానికి మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసులు 1,982గా నమోదయ్యాయి.
By April 13, 2020 at 08:55AM
No comments