Breaking News

పెళ్లి చేసుకోమని అడిగితే అఘాయిత్యం చేసిన ప్రియుడు


ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రియుడు యువతిపై అత్యాచారానికి యత్నించిన ఘటన జిల్లా మండలంలో జరిగింది. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియక పెద్దలు యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. Also Read: ప్రియుడి ఒత్తిడితో ఆమె ఆ పెళ్లిని సైతం రద్దు చేయించింది. కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు. శనివారం రాత్రి పని మీద బయటకు వెళ్లిన యువతిని అడ్డగించిన ప్రియుడు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు విన్న సోదరుడు వెంటనే అక్కడికి చేరుకోగా అతడిపై దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. దీంతో బాధితురాలు వెంటనే చింతపల్లి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By April 13, 2020 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-rape-attempt-on-girl-friend-in-nalgonda-district/articleshow/75115786.cms

No comments