మే 3 వరకు లాక్ డౌన్... మన దగ్గర వేరే దారి లేదు: ప్రధాని మోదీ

లాక్ డౌన్ నిర్ణయమే భారత్‌కు సరైనదన్నారు . సామాజిక దూరంతోనే చాలా లాభం చేకూరిందన్నారు. ఆర్థిక దృష్టితో చూస్తే ... ఈ నిర్ణయంతో మనకు చాలా నష్టమన్నారు. దీనికి భారీ మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ దేశ ప్రజలకంటే ఇది మనకు ఏదీ ముఖ్యమైనది కాదన్నారు ప్రధాని. రాష్ట్రాలు సైతం దీన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో బాగా పనిచేస్తున్నాయన్నారు. ఇంతలా అంతా పనిచేస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తుంది. లాక్ డౌన్ పొడిగించాలనే అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాయి. అన్నిపరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 3 వరకు భారత్ లాక్ డౌన్‌లోనే ఉండాలి. దేశ ప్రజలందరికీ ఇదే నా విన్నపం అన్నారు ప్రధాని. కరోనాను ఎట్టి పరిస్థితుల్లోనే విస్తరింపచేయకూడదని పిలుపునిచ్చారు. కరోనా మృతులు, కేసులు ఇకపై ఏ మాత్రం పెరిగినా ఇది మనకు అత్యంత దుర్భరనీయమైన పరిస్థితి అన్నారు మోదీ.
By April 14, 2020 at 10:21AM
No comments