గెస్ట్‌హౌస్‌లో మందు, విందు.. ఖమ్మంలో కరోనా స్పెషల్ డ్యూటీ అధికారుల పైత్యం

లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. మండల స్థాయి అధికారుల్లో కొందరు రాత్రివేళ మద్యం, మాంసాహారంతో విందు చేసుకొంటూ మీడియాకు చిక్కారు. ఈ ఘటన జిల్లా మధిరలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే.. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు మండల అధికారి విశ్రాంతి భవనంలో మందు పార్టీ చేసుకోవడం చర్చనీయాంశమైంది. వీరంతా కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధులు నిర్వహిస్తున్న వారే గమనార్హం. Also Read: అధికారుల మద్యం పార్టీ గురించి తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా.. ఓ అధికారి బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు లోపలే ఉన్న ఆయన ఆ తర్వాత మీడియాకు చిక్కకుండా పరుగు తీశారు. మరో అధికారి ఏకంగా గోడదూకి పరారయ్యాడు. టేబుల్‌పై మద్యం సీసాలు, మాంసాహారం, ఇతర వంటకాలు చూసి మీడియా ప్రతినిధులు వాటిని ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. Also Read:
By April 14, 2020 at 10:10AM
No comments