Breaking News

YS Jagan చూస్తున్నారా..?: ఏపీ బీజేపీ ఇంఛార్జీ సునీల్ దేవ్‌ధర్ ఫైర్


స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ గుండాలు దాడి చేశారని ఆరోపిస్తోంది. ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా.. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో తమ కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి తెగబడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. ‘చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల కోసం నామినేషన్ వేయడానికి వెళుతున్న బీజేపీ కార్యకర్తలపై నిన్న వైసీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు’ అని బీజేపీ ఏపీ విభాగం కూడా ట్వీట్ చేసింది. చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ఈ తరహా దౌర్జన్యానికి బీజేపీ కార్యకర్తలు భయపడబోరన్నారు. ఈ విషయమై ఏపీ బీజేపీ సహ ఇంఛార్జి కూడా స్పందించారు. ‘జగన్ గారూ మీరు చూస్తున్నారా? ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పకుండా ఆపండి’ అని ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు.


By March 11, 2020 at 01:16PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/are-you-watching-ap-bjp-co-incharge-sunil-deodhar-questions-ap-cm-ys-jagan/articleshow/74573190.cms

No comments