Breaking News

కేరళలో కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిన నలుగురు బాలికలు.. కాళ్లు విరిగి ప్రాణాపాయ స్థితిలో


కేరళలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నడిరోడ్డుపై అతివేగంతో ఇష్టం వచ్చినట్లు ప్రయాణిస్తూ ఆరుగురిని ఆస్పత్రిపాలు చేసింది. కారు బీభత్సానికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు గగుర్పొడిచేలా ఉన్నాయి. కేరళలోని అలప్పుజ జిల్లా పూచక్కల్‌లో ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుపై అతివేగంగా ప్రయాణించిన కారు తొలుత రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అనీశ్(36) అనే వ్యక్తితో పాటు వేడు(4) అనే బాలుడు గాయపడ్డారు. Also Read: అయినప్పటికీ వేగం తగ్గని కారు కొద్దిదూరంలో ముగ్గురు విద్యార్థినులను ఢీకొట్టింది. స్కూల్ నుంచి ఇంటికి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కారు అవతలి వైపు నుంచి దూసుకొచ్చి వారిని ఢీకొట్టింది. దాని వేగానికి ముగ్గురు బాలికలు గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డారు. అనంతరం సైకిల్‌పై వెళ్తున్న మరో విద్యార్థినిని కారు ఢీకొట్టి కొద్దిదూరంలో ఉన్న కాంక్రీట్ దిమ్మను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురు బాలికలను పూచక్కల్‌లోని శ్రీకాంతేశ్వరం స్కూల్‌‌లో చదువుతున్న అనఖా, కెఎస్ చందన, సాహి, అర్చనగా గుర్తించారు. Also Read: ఈ ఘటనపై సమాచారం అం దుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసకున్నారు. వారిని స్థానికుడు మనోజ్, అస్సాంకు చెందిన ఆనంద్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో మనోజ్ కారు నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాలికలను ఎర్నాకుళంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనఖాకు తొడ ఎముక విరగడంతో పాటు ముక్కుకు గాయమైందని, చందన, సాహికి కాలు విరగ్గా, అర్చనకు మోకాలి వద్ద ఎముక విరిగిందని డాక్టర్లు తెలిపారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కలమసేరి మెడికల్ కాలేజీకి తరలించినట్లు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు తెలిపారు. Also Read: కారులో ఉన్న మనోజ్‌, ఆనంద్‌కు కూడా గాయాలు కావడంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. మనోజ్ మద్యం తాగినట్లుగా ఆనవాళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే వారి నుంచి రక్త నమూనాలు తీసుకుని టెస్ట్‌ల కోసం పంపించామని, రిపోర్టులు వచ్చాకే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం కేరళలో వైరల్‌గా మారాయి. Also Read:


By March 11, 2020 at 01:04PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/shocking-cctv-footage-overspeeding-car-rams-into-students-in-kerala-6-injured/articleshow/74572934.cms

No comments