నిద్రపోతున్న భర్తకు ఉరేసి చంపిన ఇల్లాలు.. ఆపై ప్రియుడితో పరార్

వివాహేతర సంబంధానికి మరో అమాయకుడి ప్రాణం బలైపోయింది. ప్రియుడి మోజుతో ఓ మహిళ కట్టుకున్న భర్తనే కిరాతకంగా చంపేసి పరారైంది. ఈ ఘటన వరంగల్‌లోని కరీమాబాద్ కాశికుంటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాదారపు రాజు(33) అనే వ్యక్తి కాశికుంటలో భార్య శివరాత్రితో కలిసి నివాసముంటున్నాడు. ఇటీవల ఆమె అనిల్ అనే యువకుడితో పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికే రప్పించుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న రాజు పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. అయితే తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని శివరాత్రి నిర్ణయించుకుంది, ప్లాన్ ప్రకారం శుక్రవారం రాత్రి నిద్రపోతున్న భర్తను ప్రియుడి సాయంతో మెడకు తాడుతో ఉరేసి చంపేసింది. ఏమీ ఎరుగనట్లుగా ఇంటికి తాళం వేసి ప్రియుడితో పరారైంది. శనివారం ఆ ఇంటిని చూసిన స్థానికులు దంపతులు ఎక్కడికైనా వెళ్లి ఉంటారని భావించారు. Also Read: అయితే ఆదివారం ఉదయం ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి లోపలికి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో రాజు మృతదేహం కనిపించింది. అతడి భార్య కనిపించకపోవడం, విచారణలో ఆమెకు అనిల్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలడంతో భర్తను ఆమె చంపేసి పరారైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి చెల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By March 23, 2020 at 09:24AM
No comments