కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: మార్చి 25 నుంచి 144 సెక్షన్ తరహా నిషేధాజ్ఞలు?

⍟ మహారాష్ట్రలో మరింత ఉద్ధృతమవుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 89కి చేరింది. ఆదివారం సాయంత్రం మరో 15 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, పంజాబ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు తన ఒక్క రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ⍟ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలు ఇంటి నుంచి కదలకుండా కాలు బయట పెట్టకుండా... బయట ఉన్న వైరస్ బయటనే నశించే విధంగా కీలక చర్యలు చేపడుతున్నాయి. అయితే తాజాగా దేశాలు రాష్ట్రాలు వైరస్ తీవ్రతను తగ్గించేందుకు లాక్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో... దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కేవలం లాక్ డౌన్ చేసినంత మాత్రాన కరోనా వైరస్ ప్రభావం తగ్గదని షాకింగ్ న్యూస్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ⍟ కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 14,650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3,37,533కి చేరింది. గడచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 1,450 మంది మృతిచెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ⍟ దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న 80 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం.. వచ్చే రెండు రోజుల్లో మరిన్న కఠిన నిర్ణయాలను తీసుకోనుంది. రోజు రోజుకూ వైరస్ తీవ్రంగా పెరుగుతుండటంతో మహమ్మారిని కట్టడిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడంతో మహమ్మారి కోరలు పీకడానికి సంసిద్ధమైంది. కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 396కి చేరుకుంది. ⍟ కరోనా వైరస్‌ను కట్టడి చేయడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయా? ఉండవా? అనే అనుమానం చాలా మందికి వచ్చింది. దీంతో సోమవారం నుంచి మీ క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయా? అని చాలా మంది ఉబర్ సంస్థను ట్విట్టర్ ద్వారా అడగటం ప్రారంభించారు. వీరందరికీ ఉబర్ సంస్థ సమాధానం ఇచ్చింది. ⍟కరోనా వైరస్‌పై పోరాటానికి భారత పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో కోవిడ్‌ను కట్టడి చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. సౌదీ అరేబియా నుంచి విశాఖపట్నం వచ్చిన రోగి సంబంధీకురాలైన మహిళ (49)కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. . ⍟ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అందుకొని రాష్ట్రంలో ‘జనతా కర్ఫ్యూ’ను అద్భుతంగా నిర్వహించారని ఆయన కితాబిచ్చారు. జనతా కర్ఫ్యూను అద్భుతంగా నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. .
By March 23, 2020 at 08:48AM
No comments