Breaking News

భయానక ఘటన.. మనిషి మాంసంతో కూర వండేసిన తాగుబోతు


మద్యం తాగితే కొందరు మరో లోకంలో విహరిస్తుంటారు. మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఇదే విధంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ తాగుబోతు చేసిన పనితో ఊరంగా ఉలిక్కి పడింది. ఇంతకీ అతడేం చేశాడో తెలుసా మనిషి మాంసంతో కూర వండాడు. వినడానికి భీతిగొల్పేలా ఉన్న ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుడుచూసింది. Also Read: బిజ్నూర్‌ జిల్లా టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(32) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మత్తులో విచిత్రంగా ప్రవర్తిస్తూ భార్య, కుటుంబసభ్యులను ఇబ్బంది పెడుతుండేవాడు. సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన సంజయ్ గ్రామ శివారులో ఉన్న శ్మశానానికి వెళ్లి మృతదేహం చేయిని లాక్కుని ఇంటికి తెచ్చాడు. దాని వేళ్లు నరికి గిన్నెలో కూర వండటం ప్రారంభించాడు. Also Read: అదే సమయంలో మార్కెట్ నుంచి ఇంటికొచ్చిన అతడి భార్య కిచెన్‌లో భర్త చేస్తున్న పనికి హడలిపోయింది. బయటకు పరుగు తీసి స్థానికులకు ఈ విషయం చెప్పడంతో అందరూ షాకయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 10, 2020 at 02:43PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/shocking-incident-up-man-arrested-for-cooks-human-flesh-in-dinner/articleshow/74562542.cms

No comments