Breaking News

మచిలీపట్నంలో అర్థరాత్రి ప్రేమజంట కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల వేట


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రేమజంట కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. బస్టాండ్‌ వద్ద ఆదివారం వేచిచూస్తున్న జంటను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు యత్నించడం, ఓ వ్యక్తి పోన్‌కాల్‌తో పోలీసులు వారిని వెంబడించి పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. Also Read: మచిలీపట్నం బస్టాండ్‌లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువజంట కూర్చుని ఉంది. నలుగురు వ్యక్తులు వారిని చుట్టుముట్టి చేతులు పట్టుకున్నారు. బలవంతంగా బస్సు ఎక్కించారు. కేకలు పెట్టకుండా వారి నోరు నొక్కేశారు. అదే సమయంలో స్నేహితుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన జాకబ్ అనే వ్యక్తి ఏదో జరుగుతోందని అనుమానించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బస్సును వెంబడించి పామర్రు వద్ద దాన్ని అడ్డుకున్నారు. Also Read: ప్రేమ జంటను బలవంతంగా తీసుకెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి మందలించడంతో పరారై మచిలీపట్నం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వారిని వెంబడించి మచిలీపట్నం బస్టాండ్‌లో పట్టుకుని తిరిగి తీసుకెళ్తున్నారు. ప్రేమజంటకు రక్షణగా నిలిచి మచిలీపట్నం పోలీసులు ఈ విషయాన్ని కొత్తగూడెం పోలీసులకు చేరవేశారు. వారిని ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి పంపించారు. Also Read:


By March 10, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-couple-kidnapped-in-machilipatnam/articleshow/74560610.cms

No comments