దంపతుల దారుణ హత్య, భార్యపై అత్యాచారయత్నం?.. 15ఏళ్ల బాలుడు కూడా

తమిళనాడులోని సేలంలో భార్యభర్తలతో పాటు వారి బంధువైన ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఆకాశ్ (29) దంపతులు కొన్నాళ్లుగా సమీపంలోని పనంగాడు పెరుమాకౌండనూర్‌లో నివాసముంటున్నారు. వీరికి 10 నెలల కుమారుడున్నాడు. దంపతులతో పాటు సమీప బంధువైన సన్నీ(15) అనే బాలుడు కూడా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి బాలుడు ఏడుపు వినిపించడంతో స్థానికులు ఆకాశ్ ఇంటికెళ్లి చూడగా అతడి భార్య రక్తపు మడుగులో కనిపించింది. ఇంటి వెనక ఆకాశ్, సన్నీ విగతజీవులుగా పడి ఉన్నారు. Also Read: దీంతో కంగారు పడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేలం పోలీస్ కమిషనర్ సెంథిల్‌కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండుగులు ముందుగా ఆకాశ్ భార్యను, తర్వాత ఇద్దరిని చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక స్థానికంగా ఉండే ఆగ్రాకు చెందిన నలుగురు యువకులు వినోద్, దినేశ్, విజి, సురాజ్ కనిపించకపోవడంతో పోలీసులను అనుమానం వచ్చింది. Also Read: సీసీ కెమెరా పుటేజీ ఆ నలుగురు యువకులు ఆదివారం రాత్రి ఆకాశ్ ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో వారే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆకాశ్ భార్య మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు, ఆమె దుస్తులు చిరిగిపోయి ఉండటంతో అత్యాచారయత్నం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె నిందితులను ప్రతిఘటించడంతోనే ప్రాణాలు తీసి ఉండొచ్చని తెలుస్తోంది. పరారీల ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. Also Read:
By March 10, 2020 at 10:20AM
No comments