Breaking News

స్మార్ట్‌ఫోన్ కోసం ప్రాణం తీసుకున్న బాలిక.. కామారెడ్డిలో దారుణ ఘటన


సెల్‌ఫోన్ కొనివ్వలేదన్న కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని దోమకొండకు చెందిన మౌనిక(16) కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. టెన్త్ పాసైనప్పటి నుంచి స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరుతోంది. అయితే ఫోన్ కొనిస్తే కూతురు చదువులో వెనకబడిపోతుందన్న ఆందోళనతో వారు వాయిదా వేస్తూ వస్తున్నారు. Also Read: అయితే కొద్దిరోజులుగా మౌనిక సెల్‌ఫోన్ కోసం తల్లిదండ్రులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. పరీక్షలు ముగిశాక తప్పకుండా కొనిస్తామని వారు చెప్పినా వినకుండా పట్టబడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ముందు పరీక్షలు సక్రమంగా రాస్తే తర్వాత కొనిస్తామని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఎలుకల మందు తినేసింది. ఆమెను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. Also Read: పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. చేయి దాటిపోవడంతో మౌనిక బుధవారం ప్రాణాలు కోల్పోయింది. చిన్న కారణంగా కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తండ్రి కుకుట్ల శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 11, 2020 at 02:47PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/inter-student-commits-suicide-over-smart-phone-in-kamareddy/articleshow/74574067.cms

No comments