మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నం.. హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్

ఓ వైపు దేశమంతా కరోనా వైరస్‌తో భయపడి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతే.. ఇదే అదనుగా కొందరు మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు పన్నిన పన్నాగాన్ని నగర పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందుకోసం ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: రెండు వారాల క్రితం మాదన్నపేట ప్రాంతంలోని ఓ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సును తగలబెట్టి సమీపంలోని ఓ హిందూ దేవాలయంపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి దేవాలయ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా సైదాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By March 31, 2020 at 10:49AM
No comments