Breaking News

సమోసాలు తెమ్మని కరోనా హెల్ప్‌లైన్‌కు ఫోన్.. గట్టి గుణపాఠం చెప్పిన అధికారులు


కరోనా వ్యాప్తితో దేశమంతా భయాందోళనలకు గురై లాక్ డౌన్ విధించుకుంటే, ఓ ఆకతాయి మరీ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. లాక్ డౌన్ వేళ అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్-19 హెల్ప్ నెంబరుకు ఫోన్ చేసి, వేడి వేడి సమోసాలు తీసుకురావాలని కోరాడు. ఆ యువకుడి ప్రవర్తనపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు అతను మూల్యం చెల్లించేలా తగిన శిక్ష విధించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైనుకు ఫోన్ చేసి సమోసాలు ఆర్డరిచ్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ హెల్ప్‌లైన్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఏకంగా నాలుగు వేడి వేడి సమోసాలు తీసుకురమ్మని డిమాండ్‌ చేశాడు. అధికారులు స్పందించకపోవడంతో అతను పదే పదే ఫోన్ చేసి సమోసాలు తీసుకురావాలని వేధించాడు. దీంతో విపరీతంగా విసిగిపోయిన రాంపూర్‌ జిల్లా మెజిస్ట్రేటు (కలెక్టర్) ఆంజనేయ కుమార్‌ సింగ్‌ అతనికి గట్టి గుణ పాఠం చెప్పాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో ప్రకటించడంతో ఇది వైరల్‌గా మారింది. Also Read: అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించినందుకు ఆ వ్యక్తికి బోనస్‌గా మురికి కాల్వలు శుభ్రం చేయాలనే సామాజిక శిక్ష విధించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై విపరీతంగా స్పందించిన నెటిజన్లు ఆ ఆకతాయికి సరైన శిక్షే విధించారంటూ కామెంట్లు చేస్తున్నారు. Also Read:


By March 31, 2020 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-calls-to-covid-helpline-and-orders-hot-samosa-in-rampur-dist/articleshow/74906612.cms

No comments