Breaking News

గుంటూరు జిల్లాలో దారుణం.. ఏడో తరగతి బాలికను ఎత్తుకెళ్లి


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కామాంధుల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా జిల్లా మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఏడో తరగతి బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన గురువారం ఆలస్యంగా వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఏడో తరగతి చదువుతున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు ప్రేమ పేరుతో వెంట తిప్పుకుంటున్నాడు. Also Read: మూడురోజుల క్రితం బాలికకు ఫోన్ చేసిన ఆ బాలుడు మాట్లాడుకుందామని చెప్పి గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించాడు. ఒంటరిగా అక్కడికి వచ్చిన బాలికను తన ఇద్దరు స్నేహితులతో కలిసి బంధించాడు. ఆమెపై ఆ ముగ్గురు కలిసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె దుస్తులు విప్పేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు వేస్తూ వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. Also Read: ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ కిశోర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముగ్గురూ మైనర్లు కావడంతో పోలీసులు వారి వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. Also Read:


By March 27, 2020 at 11:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chebrolu-police-booked-case-on-3-boys-over-rape-attempt-on-minor-girl/articleshow/74842022.cms

No comments