Breaking News

మీరు ఇలాగే లేట్ చెయ్యండి.. తరువాత తుర్రే: RRRపై కొరటాల ట్వీట్


‘‘ఈ రాజమౌళి ఉన్నాడే.. అన్నింటికీ లేటే.. మాట నిలబెట్టుకోవడం ఆయన బ్లడ్‌లోనే నేనట్టు ఉంది.. ఒక్కటంటే ఒక్క సినిమాకి అయినా చెప్పిన టైంకి అప్డేట్ ఇచ్చాడా?? ప్రమోషన్స్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు’’ అంటూ , ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ట్విట్టర్‌లో ఏ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంలో ట్విట్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై ట్రోల్స్‌తో పాటు చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల లాంటి అగ్ర దర్శకులు, హీరోల మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో చిరంజీవి 152 మూవీ రూపొందించిన కొరటాల శివ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘మీరు ఇలాగే లేట్ చేయండి.. మా బాస్ మా ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ని లీక్ చేసినట్టే తుర్.. మని వీడియో వదిలేస్తారు ఎవ్వరికీ చెప్పకుండా’ అంటూ #భీమ్ ఫర్ రామరాజు హ్యాష్ ట్యాగ్‌తో ఫన్నీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ కరెక్ట్‌గా చెప్పారు సార్.. వీళ్లు ఈరోజుకు వీడియో వదిలేలా లేరు.. వాళ్లు వీడియో వదిలేలోపు మీరు ‘ఆచార్య’ సినిమా రిలీజ్ చేసేయొచ్చు. కాస్త చెప్పండి సార్ మీరైనా’ అని కామెంట్స్ రావడంతో ఏమనుకున్నారో ఏమో కాని కొరటాల తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. కాగా ఉదయం ఐదుగంటలకు రామ్ చరణ్‌కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా అంటూ ట్వీట్ చేసిన ఎన్టీఆర్.. అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోవడంతో రామ్ చరణ్‌కి క్షమాపణ చెప్తూ.. ఆ వీడియోను జక్కన్నకు పంపించానని అందుకే లేట్ అయ్యిందని ఖచ్చితంగా 4 కి రిలీజ్ చేస్తాం అని చెప్పగా.. ‘వాట్.. ఆయనకు పంపించావా? అయితే ఈరోజుకి వస్తుందా? అంటూ ట్వీట్ చేశారు రామ్ చరణ్. ఇక ఐయామ్ వెయిటింగ్ అంటూ చిరంజీవి కూడా ట్వీట్ చేయడంతో.. ‘సార్.. అంటే.. అది కొంచెం.. కొంచెం.. యాక్యువల్‌గా’ అంటూ వీడియో విడుదల చేయలేకపోయాం అన్నమాటను నసుకుతున్నట్టుగా ట్వీట్ పెట్టారు రాజమౌళి. ‘మీ గురించి మాకు తెలిసిందేగా అన్నట్టుగా.. చిరంజీవి ‘అర్థమైంది జక్కన్నగారూ’ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి రాజమౌళి ఈ వీడియో అనుకున్న టైంకి విడుదల చేయలేకపోయినా.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.


By March 27, 2020 at 12:09PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-koratala-siva-funny-tweet-about-rrr-rrr-ram-charan-video-delay/articleshow/74842249.cms

No comments