Breaking News

YS Jagan: సీఎం ఆశలపై కేంద్రం నీళ్లు.. కీలక నిర్ణయానికి బ్రేకులు!


ఆంధప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2021 మార్చి తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. జనవరి 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు అధికార పరిధుల్లో ఎలాంటి మార్పులు చేపట్టొద్దని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడమే ఈ ఆలస్యానికి కారణం. 2021 జనాభా లెక్కల్లో భాగంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్‌తోపాటు ఎన్‌పీఆర్‌ను అప్డేట్ చేయాలని భావించడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల కారణంగా జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు రాష్ట్రాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దీంతో రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న జగన్ నిర్ణయం ఆలస్యం కానుంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25కి పెంచుతామని.. పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో సైతం పేర్కొన్నారు. జిల్లాల సంఖ్య పెంచడం వల్ల మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ హామీని నెరవేర్చడం కోసం జగన్ కసరత్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఏడాదిలో పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాని తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ 2026 తర్వాతే మిగతా రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల పునర్విభజన ప్ర్రక్రియను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించింది. సీఎం జగన్ బర్త్ డే వేడుకల సందర్భంగా.. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. . ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు, ఒక జిల్లాకు అల్లూరి సీతారామ రాజు పేరు పెడతామని జగన్ మాటిచ్చారు.


By February 19, 2020 at 09:37AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/new-districts-in-andhra-pradesh-to-come-up-after-march-2021/articleshow/74201889.cms

No comments