Breaking News

ఫేస్‌బుక్ ట్రాప్.. 100 మంది మహిళల న్యూడ్ ఫోటోలు సేకరించి లైంగిక వేధింపులు


ప్రకాశం జిల్లాలో ఫేస్‌బుక్ మాయగాడి లీలలు బయటపడ్డాయి. ఫేస్‌బుక్ ద్వారా మహిళలను పరిచయం పెంచుకుని వారి వ్యక్తిగత సమాచారం, నగ్న చిత్రాలు సేకరించిన ఓ యువకుడు వాటితో మహిళలను వేధిస్తున్నాడు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 100 మంది మహిళలను వేధించిన వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం కలవళ్లకు చెందిన మోదేపల్లి నరేష్‌(25) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. ఫేస్‌బుక్‌లో మహిళల సమాచారం సేకరించి ఫోన్‌నంబర్లు తెలుసుకుని.. వాట్సాప్‌లో సందేశాలు పంపేవాడు. తాను బంగారం వ్యాపారినని నమ్మించి ఫోటోలు పంపించి నమ్మించేవాడు. సాన్నిహిత్యం పెరిగిన తర్వాత యువతులు, మహిళల నగ్నచిత్రాలు పంపించమని కోరేవాడు. తనకు న్యూడ్ ఫోటోలు పంపిన వారికి బంగారు నగలు ఇస్తానని ఆశ పెట్టేవాడు. Also Read: అతడి మాటలు నమ్మిన కొందరు మహిళలు నగ్నచిత్రాలు పంపేవారు. ఇలా సుమారు 100 మంది మహిళలు అతడి ట్రాప్‌లో పడ్డారు. ఆ నగ్నచిత్రాలు అడ్డం పెట్టుకుని లైంగిక కోరికలు తీర్చాలని, లేకపోతే వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తానని నరేష్‌ వేధించేవాడు. కె.ఉప్పలపాడుకు చెందిన ఓ మహిళను కూడా ఇదేవిధంగా వేధించడంతో ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సింగరాయకొండ సీఐ యూ.శ్రీనివాసులు, ఎస్సై ఎన్‌సీ ప్రసాద్‌ అతడి కోసం తీవ్రంగా గాలించారు. ఫోన్‌ నంబర్‌తో పాటు, ఐఎంఈఐ సంఖ్యను మారుస్తుండటంతో నెలరోజుల పాటు గాలించి పట్టుకున్నారు. Also Read: నరేష్ ఫోన్‌లో మహిళల ఫోన్‌ నంబర్లే ఎక్కువగా ఉండటంతో పోలీసులు షాకయ్యారు. మహిళలకు పంపిన మెసేజ్‌, వారి నుంచి సేకరించిన నగ్నచిత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్‌మీడియా పరిచయమైన వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By February 19, 2020 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prakasam-district-man-arrested-for-collecting-nude-photos-of-woman-and-harassed-thier/articleshow/74201975.cms

No comments