KCR: ఆలయాభివృద్ధి కోసం అక్బరుద్దీన్ రిక్వెస్ట్.. బీజేపీ నేత రెస్పాన్స్ అదిరింది!
హైదారాబాద్: పాతబస్తీలోని లాల్ దర్వాజ మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే .. సీఎం కేసీఆర్ను కోరిన సంగతి తెలిసిందే. రూ.10 కోట్లతో ఆలయాన్ని విస్తరించాలని ఆయన కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన వినతి పత్రం ఇచ్చారు. మజ్లిస్ పార్టీకి చెందిన కీలక నేత సీఎం కేసీఆర్ను హిందూ ఆలయ అభివృద్ధి కోసం కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఎంఐఎం.. హిందువుల సమస్యను సీఎం దృష్టికి తీసుకురావడం పట్ల బీజేపీ నేత, నటి స్పందించారు. మార్పు మొదలైందన్న మాధవీలత.. మోదీ ప్రధానిగా ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపితమైందన్నారు. ‘‘‘అయ్యబాబోయ్.. మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు, నిన్న జనగణమణ పాడారు, నేడు గుడులు బాగుచేయాలంటున్నారు.. మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా’’ అని ఆమె ఫేస్ బుక్లో పోస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారంటూ.. సీఎంకు మజ్లిస్ నేత వినతిపత్రం ఇస్తున్న ఫొటోను మాధవీలత షేర్ చేశారు. Read Also:
By February 10, 2020 at 10:57AM
No comments