Breaking News

భార్యపై కోపంతో అత్తకు నిప్పుపెట్టిన అల్లుడు


భార్యతో మొదలైన చిన్న వివాదం కారణంగా ఓ వ్యక్తి అత్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. అనంతసాగరం మండలం గౌరవరానికి చెందిన చల్లా లక్ష్మమ్మపై ఆమె అల్లుడు వెంకటరమణ ఆదివారం రాత్రి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆత్మకూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also Read: లక్ష్మమ్మ కుమార్తె జయమ్మను వెరుబొట్లపల్లికి చెందిన వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. జయమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆదివారం భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. రాత్రి పడుకునే సమయంలో మంచం గురించి భార్యభర్తల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వెంకటరమణ భార్యపై చేయి చేసుకున్నాడు. అనారోగ్యంగా ఉన్న తన కూతురిని ఎందుకు కొట్టావంటూ లక్ష్మమ్మ అల్లుడిని నిలదీసింది. Also Read: దీంతో ఆవేశానికి గురైన వెంకటరమణ తన బైక్‌లోని పెట్రోల్ తీసి అత్తపై పోసి నిప్పు పెట్టాడు. లక్ష్మమ్మ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి ఆస్పత్రికి తరలించారు. జయమ్మ ఫిర్యాదుతో పోలీసులు వెంకటరమణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By February 10, 2020 at 11:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-set-fire-to-mother-in-law-in-nellore-district/articleshow/74057209.cms

No comments