Coronavirus in Kerala: వుహాన్ నుంచి భారత్ చేరిన రెండో బృందం.. చిత్తూరులో కరోనా కలకలం

చైనాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను రెండు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం తొలి విమానంలో 324 మంది ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఉదయం రెండో బృందం సైతం స్వదేశానికి చేరుకుంది. వుహాన్‌లో ఆదివారం ఉదయం 3.10 గంటలకు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది. ఈ విమానంలో మొత్తం 323 మంది రాగా వారిలో ఏడుగురు మాల్దీవుల పౌరులు ఉన్నట్టు చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ ట్వీట్ చేశారు. Must Read: ఈ సందర్భంగా ఎయిరిండియా, భారత, చైనా విదేశాంగ శాఖలతో పాటు స్థానిక అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ చేరుకున్న వీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చైనాలో ఇప్పటివరకు 14 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 304 మంది మృతి చెందారు. కాగా, చిత్తూరులో కరోనా కలకలం రేగింది. రేణిగుంట విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో నలుగురికి అనుమానిత లక్షణాలు బయటపడటంతో వారిని చిత్తూరు హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అక్కడ అధికారులు అలసత్వం వహించినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. Must Read: ఇదిలా ఉండగా రెండో విమానంలోకి నలుగురిని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించలేదని సమాచారం. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో అధికారులు అనుమతివ్వలేదు. శుక్రవారం కూడా ఇద్దర్ని ప్రయాణానికి అనుమతించలేదు. మరోవైపు, భారత్‌కు చేరుకున్న 324 మందిని ఢిల్లీ సమీపంలోని మానెసర్‌కు తరలించారు. వీరిని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. దేశంలోనే రెండో కరోనా కేసు నమోదయ్యింది. చైనా నుంచి వచ్చిన కేరళ వ్యక్తి నమూనాలను పరీక్షించగా, అతడికి ఉన్నట్టు గుర్తించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. Must Read: తమ పౌరులను చైనా నుంచి తరలించినందుకు మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జయశంకర్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ, సంజయ్ సుధీర్‌ల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
By February 02, 2020 at 11:13AM
No comments