బాలిక నమ్మించి లొంగదీసుకుని.. కాకినాడలో ఆటోడ్రైవర్ అఘాయిత్యం

తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఓ ఆటోడ్రైవర్ కీచకుడి అవతారమెత్తాడు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దుమ్ములపేటకి చెందిన మరుపల్లి దుర్గాప్రసాద్(20) అనే యువకుడు ఆటో నడుపుతున్నాడు. తరుచూ తన ఆటో ఎక్కే బాలిక(16)తో మాటలు కలిపి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె కూడా అతడితో చనువుగా ఉండేది. Also read: జనవరి 27వ తేదీ బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పెళ్లి చేసుకోనని బెదిరించి బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బాలిక నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో అతడిని రిమాండ్‌కు తరలించారు. Also read: Also read:
By February 02, 2020 at 10:57AM
No comments