Breaking News

మహిళను కాపాడిన ‘కరోనా’... వైరస్ సోకిందని తెలిసి పరుగు తీసిన కామాంధుడు


చైనాలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తు్న్న ‘కరోనా’ వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రస్తుతం 20కి పైగా దేశాల ప్రజలు దీని బారిన పడి బతుకుపోరాటం చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ను మానవాళికి శత్రువుగా కొందరు అభివర్ణిస్తున్నారు. అయితే ఇదే వైరస్‌ కారణంగా ఓ మహిళ అత్యాచారం బారి నుంచి తప్పించుకుంది. ఈ చైనాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: చైనాలోని వుహాన్ సమీపంలో గల జింగ్షాన్ పట్టణంలో ఓ యువతి ఒంటరిగా నివసిస్తోంది. రెండ్రోజుల క్రితం ఓ యువకుడు ఆమె ఇంట్లోకి దొంగచాటుగా దూరాడు. గదిలో నిద్రిస్తున్న ఆమెను బెదిరించి నగలు, డబ్బులు తీసుకున్నాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని గ్రహించిన ఆ కామాంధుడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అప్పుడే ఆ యువతి సమయస్ఫూర్తిగా వ్యవహరించింది. Also Read: అతడి ముందు దగ్గినట్లు నటించగా ఏమైందని అడిగాడు. తాను కొద్దిరోజుల క్రితమే వుహాన్‌ నుంచి వచ్చానని, తనకు సోకడంతో కుటుంబసభ్యులంతా ఒంటరిగా వదిలేసి వేరే చోట ఉంటున్నారని తెలిపింది. దీంతో షాకైన ఆ కామాంధుడు ఆమెను వదిలేసి బయటకు పరుగు తీశాడు. వెళ్తూ వెళ్తూ 3,080 యువాన్లను తీసుకుపోయాడు. ఆ వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె చెప్పిన వివరాలతో పాటు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. మొత్తానికి మనుషులను చంపేస్తున్న కరోనా వైరస్ ఓ యువతి జీవితాన్ని కూడా నిలబెట్టి మరోసార్త వార్తల్లో నిలిచింది. Also Read:


By February 07, 2020 at 11:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/china-rapist-runs-away-when-woman-said-i-am-diagnosed-with-corona-virus/articleshow/74000621.cms

No comments